🌺🌺 శ్రీ రామ నామ జప కోటి 🌺🌺
🌺శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం🌺
🌺🌺 హౌజింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల🌺🌺
ఏమిటి ఈ జపకోటి?
శ్రీరామ అను తారక మంత్రమును కోటి సార్లు జపించడమే ఈ శ్రీ రామ నామ జపం కోటి.
ఈ జపకోటి వల్ల ప్రయోజనం ఏమిటి?
ఎక్కడ రామనామ స్మరణ ఉంటుందో...
అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు.
సకల కార్యాలను ఆ కొదండుని నామ శక్తి తీరుస్తుంది.
రామ నామ జపాన్ని చేసిన వారు ఎంతో మంది చరిత్రలో చిరంజీవులు అయ్యారు
అలాంటి నామం...రాసినా...పలికినా మహత్ భాగ్యం.
వేదం ప్రకారం రెండే తారకములు. ఒకటి 'ఓం' కారం. రెందవది 'రామ' నామం.
అష్టాక్షరిలోని అగ్నిబీజమైన 'రా' కారం,
పంచాక్షరిలోని అమృతబీజమైన 'మ' కారం కలిపి తారకమైనది 'రామ' నామం.
రామాయణాన్ని, రామనామాన్ని నమ్ముకొని సద్గతి పొందినవారు కోకొల్లలు.
రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో, ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాళి ఉంటుంది.
ఎలా చేయాలి?
రోజు మీకు వీలయిన సమయములో శ్రద్ధ భక్తితో రామ నామమును జపించాలి. అలా ఎన్ని సార్లు జపించినది వెంటనే దేవాలయ కార్య నిర్వాహకులకు తెలియజేయాలి.
ఒక్కరమే కోటి సార్లు జపం చేయాలా?
కాదు. ఇది సామూహిక కార్యక్రమం. అందులో మనము ఒక భాగస్వామి. అందరూ కలిపి కోటి సార్లు చేయగలగాలి. అందులో మన శక్తి అనుసారం మనం చేయాలి.
అందరూ ఒకేసారి కూర్చొని చేయాలా?
ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరూ వ్యక్తి గతముగా చేయాలి. ఎవరికి వారు వారికి అనువయిన సమయం లో మన దేవాలయమునకు వచ్చి, కూర్చొని జపము చేసుకోవచ్చు. ఆ సంఖ్యను మాత్రం కార్య నిర్వాహకులకు తెలియజేయాలి.
ఎక్కడ చేయాలి?
మన దేవాలయ ప్రాంగణములో మాత్రమే చేయాలి.
దేవాలయం లో మీకు అన్ని రకాల వసతులు (అనగా జపసంఖ్య ను లెక్కించే పరికరము, కూర్చోవడానికి ఆసనము మొ.వి.) ఏర్పాటు చేయబడతాయి.
రోజు ఎంత సంఖ్యను చేయాలి?
ఇంత సంఖ్య అనేది లేదు. ఎవరి శక్తి అనుసారము వారు చేయాలి. శ్రీరామ అను మంత్ర జపము మాత్రమే చేయాలి.
తర్వాత చేసిన జప సంఖ్యను తెలియజేయాలి
ఎప్పుడు చేయాలి?
ఉదయం, మధ్యాహ్నం , లేదా సాయంత్రం మీకు వీలయిన సమయం లో ఎప్పుడైనా చేయవచ్చును. చేయవలసినది మాత్రము మన దేవాలయ ప్రాంగణములో.
ఎప్పటివరకు ఈ కార్యక్రమం ఉంటుంది?
ఈ కార్యక్రమము శ్రీరామ నవమి వరకు అనగా 30-03-2023 గురువారము వరకు జరుగును.
భక్తులచే కోటి సార్లు శ్రీరామ నామాన్ని పలికించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యము .
ఎవరు పాల్గొనాలి?
చిన్న పెద్ద తేడా లేదు. స్త్రీలు పురుషులు బేధం లేదు. రామ నామ ఉచ్చారణే అర్హత. ఎవరు అయినా పాల్గొనవచ్చు.
ఇప్పటివరకు ఎంత పూర్తి అయింది?
ఈరోజు వరకు పూర్తయిన జప సంఖ్య 1,03,78,530( ఒక కోటి మూడు లక్షల డెభ్భై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై )
మిగతా వివరములకు ...సంప్రదించవచ్చు.
ఇట్లు
దేవాలయ కమిటీ
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం
085009 84834, 9505138264